విజయవాడలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకం

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్. సోమేష్ నియామకం

విజయవాడ: నవంబర్ 24

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కమిటీ నియామక కార్యక్రమం విజయవాడలోని GRT హోటల్స్‌ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర RTI కమిషనర్ పి.ఎస్. నాయుడు, మాజీ ఐఏఎస్ అధికారి కొండలరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్. సీతారామరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎస్.ఎస్.ఎన్. మూర్తి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్. సోమేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్. వినయ్ కుమార్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్‌గా పి. రజనీకాంత్‌లను నియమించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను RTI జై ఆంధ్రా జై భారత్ వ్యవస్థాపకులు సుమిత్రానందన్ అభినందించారు.

మీడియా రంగంలో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, పాత్రికేయుల సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో అసోసియేషన్ చురుకైన పాత్ర పోషించాలని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్. సోమేష్ నియామకం కావడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి