నూతన మద్యం విధానం ఖరారు

*నూతన మద్యం విధానం ఖరారు….నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ*

*11న లాటరీ…..12 నుంచి కొత్త దుకాణాలు…3,396 షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్*

*అర్ధరాత్రి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు*

*ప్రధాన నగరాల్లో 12 ప్రీమియం స్టోర్లు*

*తొలుత రిటైల్ వ్యాపారం ప్రైవేటుకు అప్పగించేలా ఆర్డినెన్సు*

*గీత కార్మికులకు దుకాణాలపై త్వరలో పాలసీ*

*ముఖ్యమైన తేదీలు….*

*దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం:*

మంగళవారం ఉదయం 10 గంటల నుంచి

*తుది గడువు:*

అక్టోబరు 9 వరకూ…

*లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేసేది: అక్టోబరు 11*

*లైసెన్సులు దక్కించుకున్న వారు దుకాణాలు ప్రారంభించే తేదీ: అక్టోబరు 12 నుంచి*

*లైసెన్సు రుసుముల శ్లాబుల వివరాలు*

*10 వేల లోపు జనాభా ఉంటే 50లక్షలు….10 వేల నుంచి 50 వేల వరకు 55లక్షలు*

*50,001వేల నుండి 5లక్షల వరకు జనాభా ఉంటే 65లక్షలు….5 లక్షల పైన జనాభా ఉంటే 85లక్షలు*

అమరావతి :

రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది.

మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి సోమవారం అర్థరాత్రి తర్వాత నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి రూ.2 లక్షలు చొప్పన నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి.

డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయించ నున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ప్రారంభించు కోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరే జస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ ప్రస్తుతమున్న ప్రభుత్వ దుకాణాలే యధాతథంగా కొనసాగనున్నాయి.ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కూమార్ మీనా ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *