సాలూరు: ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు 31 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని పట్టణ సీఐ అప్పలనాయుడు, పోలీసులు 108 వాహనంలో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం భవన నిర్మాణ పనులకు వెళ్తున్న ఎనిమిది మంది కూలీల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వీరిని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. తెల్లవారు జామున 4గంటల సమయంలో ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. స్టీరింగ్ లాక్ అవడం వల్ల బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని డ్రైవర్ తెలిపారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి