కొండా కోనల్లోనూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం. ప్రభుత్వం అందించే వైద్యం కాకూడదు ప్రైవేట్ పరం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వం అందించే వైద్యం ప్రైవేటీకరణ కాకూడదని వైసిపి చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా చెట్టు అనక,పుట్ట అనక,కొండా కోనల్లో ప్రజలు,గిరిజనులు ఆ పత్రాలపై సంతకాలు చేస్తున్నారు.ప్రభుత్వ వైద్యం ప్రయివేటు పరం కాకూడదనే నినాదంతో గిరిజన గ్రామాల్లో సంతకాల సేకరణకు వైసిపి నాయకులు నడుం బిగించారు.




