పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వైసీపీ అభ్యర్థన పిడిక రాజన్న దొర గారు ఈరోజు సాయంత్రం సాలూరు ఆలయ సముదాయాల్లోని వీరబ్రహ్మేంద్రస్వామి, జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులైన టేకు ధనంజయ్ మానేపల్లి నాగ తాడుపూరు శంకర్రావు మరియు పలువురు ప్రముఖలు రాజన్న దొర గారికి గౌరవప్రదంగా శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. స్వామి దయవల్ల అమ్మవారి దయవల్ల ఈసారి కూడా మీరే ఎమ్మెల్యేగా అవుతారని దానికి మా పూర్తి సహకారం అందిస్తామని సంఘ సభ్యులు తెలిపారు. ఇదేవిధంగా షిర్డీసాయి, అయ్యప్ప స్వామి, శివాలయలను కూడా దర్శించుకుని పూజలు నిర్వహించారు .