జీతాలు చెల్లించండి మహాప్రబో

జీతాలు చెల్లించండి మహాప్రబో….
పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సూపర్వైజర్ సెక్యూరిటీ తదితరులకు గత మూడు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా వారి చేత వెట్టిచాకరి చేయించుకుంటూ కాలం గడుపుతున్న కాంట్రాక్టర్ పై అధికారులు వెంటనే స్పందించాల్సిన ఉంది లేనియెడల ఆసుపత్రి విధుల నుండి బయటకు వచ్చి నిరసన తెలియజే సే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతామని వైద్యాధికారులకు తెలియజేయడమైనది. అలాగే దాదాపు సంవత్సరం పాటు పీఎఫ్ ఖాతాలో జమ చేయవలసిన బకాయిలను జమ చేయకుండా కాంట్రాక్టర్ తాత్పర్యం చేయడం పట్ల నిరసిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్ వి ఎస్ కుమార్, హాస్పిటల్ నాయకులు చంద్రమౌళి, కుమారమ్మ,శంకర్రావు, బాలకృష్ణ, ముఖ్యంగా హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్స్ తగినంతమంది పని ఒత్తిడి పెంచారని వెంటనే ఆసుపత్రికి శానిటేషన్ వర్కర్స్ ను పెంచాలని వారు డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్, సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి