సాలూరు పట్టణంలోని KH స్కూల్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.
చిన్నారులకు తనే స్వయంగా పోలియో చుక్కలు వేసారు.ప్రతి చిన్నారి ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందించాలన్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 905 పోలియో చుక్కల బూత్‌లు ఏర్పాటు చేశామని 42 మొబైల్ టీమ్స్, 19 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా పిల్లల ను గుర్తించి ఇంటి ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని ప్రతి చిన్నారి కి పోలియో చుక్కల అందేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు ఆదేశించారు.













