సాలూరు మండలంలో తేదీ 18/7 2025 అనగా శుక్రవారం విద్యుత్ లైన్ లకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియ ఉండడం వల్ల 33 కెవి గురు నాయుడుపేట లీడర్ పరిధిలో మరియు సాలూరు మండలం లో ఆటోనగర్ సబ్స్టేషన్ మరియు పాచిపెంట మండలం గురు నాయుడుపేట సబ్స్టేషన్ విద్యుత్ సరఫరా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ అధికారులు తెలియజేశారు. సాలూరు లోని ఆటోనగర్ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న పట్టణంలో శ్రీనివాస కాలనీ ,గాంధీ నగర్, కోoకివీధి, వేద సమాజం వీధి ,శివాజీ బొమ్మ జంక్షన్ ,బంగారమ్మ కాలనీ, దాసర వీధి, మెయిన్ రోడ్డు, చిన్న కుమ్మరి వీధి ,మరియు దుర్గ సాగరం, నెలిపర్తి తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని అధికారులు తెలిపారు. అదేవిధంగా పాచిపెంట మండలంలోని గురువు నాయుడుపేట సబ్స్టేషన్ పరిధిలో మోసూరు, గురు నాయుడుపేట మాతుమూరు వేటగాని వలస తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండని కావున సాలూరు మండలం మరియు పాచిపెంట మండల ప్రజలు సహకరించవలసిందిగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాల్ రావు నాయుడు తెలిపారు
