పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడికి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు*.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన పార్వతీపురం పట్టణం , సాలూరు పట్టణం పోలీసులు జిల్లాలో భద్రతా చర్యలలో భాగంగా డాగ్ స్క్వాడ్ మరియు బిడి టీం సిబ్బందితో విస్తృత తనిఖీలు చేశారు.పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్* ఆదేశాల మేరకు పార్వతీపురం పట్టణం , సాలూరు పట్టణం పోలీస్ స్టేషన్ల పరిధిలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లు, ప్రార్ధనా మందిరాలు, పార్సెల్ కేంద్రాలు, సినిమా హాల్స్, మార్కెట్స్, కళ్యాణమండపాలు, జనసంచారం ఉన్న పార్కులు పలు చోట్ల డాగ్ స్క్వాడ్,బిడి టీం సిబ్బంది సహాయంతో పోలీస్ అధికారులు,సిబ్బంది *ఫిబ్రవరి 22న* అనుమానాస్పద వస్తువులను , బాంబ్ డిస్పోజల్ (బిడి) టీం సిబ్బంది ప్రత్యేక పరికరాలతో తనిఖీలు నిర్వహించారు. ప్రజల్లో భద్రతాభావం కల్పించడం మరియు ఎలాంటి అపరిచిత ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. 1) *విధ్వంస నిరోధక తనిఖీలు* :– రైల్వే స్టేషన్లు,బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు, జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో , పార్సిల్స్, లగేజ్లను, డాగ్ స్క్వాడ్ సాయంతో అనుమానాస్పద వస్తువులు, వాహనాలు మరియు సంచులను పరిశీలించారు. బిడి టీం ఆధునిక పరికరాలతో ప్రదేశాలను తనిఖీ చేసి ఎలాంటి పేలుడు పదార్థాలు లేకుండా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడిలో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2) *అనుమానితుల కోసం ఆకస్మిక తనిఖీలు* :– ఎవరైనా అనుమానితులు/నిందితుల జాడ తెలుసుకోవడం కోసం బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఇతర జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.అనుమానితులు/ పాత నేరస్తులు/ కొత్త వ్యక్తులు / ప్రదేశాలకు – పరిస్థితులకు సంబంధం లేని వ్యక్తులు ఎవరైన ఉంటే వారు అక్కడ ఎందుకు ఉన్నారు…?, ఎక్కడ నుండి వచ్చారు…?ఎక్కడికి వెళ్తున్నారు..?, ఏ పని కోసం వెళ్తున్నారు…?, ఎవర్ని కలవడానికి వెళ్తున్నారు…?, ప్రస్తుతం ఎక్కడ వుంటున్నారు..? వంటి పలు కోణాల్లో విచారిస్తూ తనిఖీలు నిర్వహిచారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేస్తూ పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అనుమానితులను పరిశీలించడం జరిగిందని ప్రజలు కూడా ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా/ కొత్తగా కనిపించినా వెంటనే స్థానిక పోలీస్ వారి దృష్టికి గానీ, 112 నంబర్ ద్వారా పోలీస్ వారికి గానీ సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్ సూచించారు. Spread the love టపా నావిగేషన్ Panduan Broto4D Login dengan Proses Cepat dan Tanpa Hambatan విచ్చలవిడిగా బెల్ట్ షాపులు.. చోద్యం చూస్తున్న అధికారులు