మే 20 నుండి 30 వరకు సిపిఎం పార్టీ తలపెట్టిన సమైక్యత యాత్ర కార్యక్రమంలో భాగంగా పాచిపెంట మండల గరిల్ల వలస సెంటర్ వద్ద కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు అబ్దుల్ ఫరీద్ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పి తమ్మయ్య జట్ల గణేష్ కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. . ప్రహల్లా ఏప్రిల్ 22న 26 మంది పర్యాటకులను టెర్రరిస్టులు బలిగొనడం చాలా బాధాకరమని ఉగ్రదాడిని ఖండించడంలో దేశ ప్రధాని ప్రదర్శించిన ఐక్యత సమైక్యత స్ఫూర్తి ప్రజలందరినీ ఒక్క తాటిపై నిలిపింది అని అన్నారు. మనదేశంలో జాతీయ ఉద్యమ స్ఫూర్తితో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అదేవిధంగా కులం మతం జాతి భేదం లేకుండా మన సమాజంలో అన్ని తరగతుల ప్రజలు ఈ ఘాతుకంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అంతేకాదు ఉగ్రవాద కాల్పుల నుండి బయటపడిన వారిని కాపాడింది ముస్లిం సోదరులు లేనని బాధితులు బహిరంగంగా ప్రకటించారు కాశ్మీర్ ప్రజలు కూడా ఈ హత్యాకాండము ఖండించారు అయినప్పటికీ ముస్లిములకు వ్యతిరేకంగా సోషల్ మీడియా విషపూరిత మైన ప్రచారం కొనసాగడం దుర్మార్గమని అన్నారు ఇటువంటి పరిస్థితుల్లో దేశ సమైక్యత స్ఫూర్తి తో అందరం కలిసి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం నే విశ్వ గురువుగా భావించి సలాం కొడుతుందని ఆపరేషన్ సింధూరు జయప్రదం అయింది అని ప్రకటించాక కూడా కాల్పులు ఎందుకు కొనసాగుతున్నాయో మోడీ ప్రభుత్వం తెలియజేయాలని ప్రజలకు అన్నారు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ప్రాథమికంగా లౌకిక పార్టీ దేశ సమైక్యతను మతసామరస్యాన్ని రాష్ట్రాల హక్కుల కోసం కాపాడడం కోసం ప్రతిపక్షాలతో కలిసి పోరాడింది కానీ నీడది నిర్వహిస్తున్న పాత్ర దానికి భిన్నంగా ఉంది ఎన్డీఏలో భాగస్వామిగా బిజెపి మతోన్మాదానికి వంతపడుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన పార్టీలోని లౌకిక ప్రజాతంత్ర శక్తులు మతోన్మాదానికి యుద్దోన్మాదానికి వ్యతిరేకంగా మతసామరస్యం దేశ సమైక్యత భారత రాజ్యాంగ రక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అన్ని తరగతులు మాత్రం కులం వర్గాల ప్రజల మద్దతు తీసుకోవాలని మతపరిని మతపరమైన విభజనలకు తావు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో ప్రజలంతా ఐక్యతతో మతసామ్రాస్యాన్ని కాపాడుతూ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడాలని కోరారు




