అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్ష

అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్ష



మంత్రి  గుమ్మిడి సంధ్యారాణి గారు ఈరోజు శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దర్శనం చేసుకుని, ఇటీవల జరిగిన అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్షించారు.

ఈ సందర్భంగా ఉత్సవానికి వచ్చిన విరాళాలు మరియు ఖర్చుల వివరాలు వెలుగులోకి తెచ్చారు. విరాళాల పరంగా 5 లక్షలు విరాళంగా ఇచ్చినవారినుండి 20 రూపాయలు విరాళంగా ఇచ్చిన సాధారణ భక్తుల వరకు అందరి వివరాలు లెక్కల్లో పొందుపరచడం జరిగింది.

ఈ సందర్భంగా:

లక్ష రూపాయలకుపైగా విరాళం ఇచ్చినవారు 25 మందిగా ఉండగా, వారు కలిపి ఇచ్చిన మొత్తం 51 లక్షలు.

మొత్తం విరాళంగా వచ్చిన మొత్తం: ₹75,33,247

ఉత్సవానికి ఖర్చయిన మొత్తం: ₹56,49,849

మిగిలిన ₹18,83,398 ను సాలూరు కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉత్సవ కమిటీ ఖాతాలో జమ చేయడం జరిగింది.

ఈ ప్రకటనతో ఉత్సవంలో విరాళాలు సేకరణ, ఖర్చులు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడినట్టు మంత్రివర్యులు తెలిపారు. భక్తులు ఇచ్చిన ప్రతి పైసా విలువైనదని, దేవస్థానం అభివృద్ధిలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం ప్రశంసనీయమని మంత్రి అన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి