అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష

అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష



నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం

అంగన్‌వాడీలకు పోషకాహార సరఫరా పై సమీక్ష

జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి

పార్వతీపురం, డిసెంబర్ 20: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నవంబర్ నెలకు సంబంధించి అంగన్‌వాడీ కేంద్రాలకు వివిధ నిత్యావసర వస్తువుల సరఫరా మరియు పంపిణీపై శనివారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో  ఆయన సంబంధిత శాఖల అధికారులతో  సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బియ్యం, కందిపప్పు, వంట నూనె అత్యుత్తమ నాణ్యతతో ఉండాలని, ఎక్కడా నిల్వలు నిలిచిపోకుండా సకాలంలో సరఫరా చేయాలని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. అలాగే చిన్నారులకు, గర్భిణీలకు అందించే పాలు తాజాగా ఉండేలా చూడాలని, ఏపీ డెయిరీ ద్వారా సరఫరా ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. కేంద్రాలకు అందే కోడిగుడ్ల నాణ్యతను నిరంతరం తనిఖీ చేయాలన్నారు. అలాగే చిన్నారుల శారీరక పెరుగుదలకు అవసరమైన బాలామృతం, పోషకాహార కిట్‌ల పంపిణీని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే ప్రతి వస్తువు నాణ్యతను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించాలని, ఎక్కడైనా నాణ్యత లోపించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జేసీ హెచ్చరించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతున్నదీ లేనిదీ పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిణి కనక దుర్గా, ఉప వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా పౌర సరఫరా అధికారి, జిల్లా మేనేజర్ పౌర సరఫరాలు, గుడ్లు, పాలు సరఫరాదారులు,  CDPOలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి