**ఆశా నోడల్ అధికారులతో సమీక్ష*
**ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన సేవలు అందించాలి : డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కరరావు*
పార్వతీపురం,డిసెంబర్16: ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కగా అమలు చేసి మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఆశా నోడల్ అధికారులతో ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యకార్యక్రమాల అమలు తీరు,వైద్య సేవలపై సమీక్ష జరిపారు.మాతా శిశు నమోదు శాతం పెంచాలని,త్వరితంగా గర్భిణీల నమోదు,పరీక్షలు జరిపి హైరిస్క్ గర్భిణీలు గుర్తించాలన్నారు. నిర్ణీత సమయంలో తనిఖీలు,వైద్య పరీక్షలు జరిపించి ప్రసవానంతరం వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు చేయాలన్నారు. కిల్కారీ వాయిస్ కాల్స్ సూచనలను ప్రతీ గర్భిణీ,బాలింత విని ఆచరించేలా అవగాహన కల్పించాలన్నారు. శిశువులో శ్వాస సంబంధిత సమస్యలు గుర్తించే శాన్స్ సర్వే జరిగేట్లు చూడాలన్నారు. మాతా,శిశు మరణాలు జరగకుండా సమష్టి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్.సి.డి సర్వే లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించి వైద్యాధికారి ద్వారా అవసరమైన వారిని పిఓయు కి చేరేలా కార్యాచరణ చేయాలన్నారు.స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ నెలాఖరుకు పూర్తి చేసి 4డి లు గుర్తించాలన్నారు. లేప్రసీ సర్వే లో గుర్తించిన లక్షణాలున్నవార్కి తగు చికిత్స అందేవిధంగా చూడాలన్నారు. ఈనెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై మండల, గ్రామీణ స్థాయిలో సమన్వయ సమావేశాలు జరపాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ద్యేయంగా కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఐఓ డా. విజయమోహన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డా కెవిఎస్. పద్మావతి,ఎన్.సి.డి పిఓ డా టి. జగన్ మోహనరావు, డిపిఓ లీకారాణి,డిసిఎం విజయలత,హెల్త్ ఎడ్యుకేటర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.





