సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం

సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం

సాలూరు ఘనంగా ఏఐటీయూసీ106 వ ఆవిర్భావ దినోత్సవం

ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఏఐటీయూసీ  వద్ద జెండా ఆవిష్కరణ చేసి కార్మికులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఏఐటీయూసీ నాయకురాలు  బలగా రాధా  మాట్లాడుతూ 1920 అక్టోబరు 31న ముంబైలో లాలాలజపతిరాయ్‌ బిన్ రాయ్ సమక్షంలో యూనియ న్‌ స్థాపించబడినట్టు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చేవరకు బ్రిటీష్‌ పాలకుల హయాంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఏఐటీయూసీ, పేమెంట్‌ యాక్టు, ప్రమాదబీమా యాక్టు, ట్రేడ్‌ యూనియన్‌ యాక్టు, మినిమం వేజ్‌ యాక్టు, ఐడీ యాక్టు వంటి 18 చట్టాలను సాధించినట్టుతెలిపారు . స్వాతంత్ర అనంతరం 26 చట్టాలను సాధించడంలో ఏఐటీయూసీ పాత్ర ఉన్నట్టు తెలిపారు.

అసంఘటిత రంగ హమాలీ కార్మికులకు సంక్షేమ చట్టం ఎప్పుడు అమలు చేస్తారో తేల్చాలని డిమాండ్ చేశారు.బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మనుధర్మం పేరుతో దేశాన్ని వందేళ్లు వెనక్కి తీసుకువెళుతున్నారని అన్నారు. ధరలేమో ఆకాశాన్ని తాకుతుంటే వేతనాలు కిందకి దిగిపోతున్నాయని, దేశంలో సుమారు 41 కోట్ల మంది ప్రజలు దారిద్య్రంలో ఉన్నా నాయకులుకు పట్టడంలేదని విమర్శించారు. దేశంలో ఆకలి చావులు, నిరుద్యోగం పెరిగిపోయాయని అన్నారు. కార్మికులను, ఉద్యోగులను బానిసలుగా చేసేందుకు లేబర్‌ కోడ్‌లు తెచ్చారని విమర్శించారు. జిఎస్‌టి తగ్గించామని చెబుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంపు గురించి ఎందుకు మాట్లడటంలేదని, రాష్ట్రానికి రావాల్సిన జిఎస్‌టి వాటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచారని, మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుకు అప్పజెబుతున్నారని, దీనివల్ల పేదలకు, మధ్యతరగతలకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు.13 గంటల పని విధానం వల్ల ఉద్యోగులకు ఆనారోగ్యం వస్తే ఎవరు భాద్యులని, రాత్రి పూట మహిళా ఉద్యోగుల పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు. లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి