సాలూరు నియోజకవర్గం-మక్కువ మండలం- సంబర గ్రామంలో
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాజన్న మావుడి బ్రదర్స్
అవినీతి రహితంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి పేదవారికి అండగా నిలిచిన ఘనత జగన్ గారికి దక్కుతుందని మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వారిని ఆర్థికంగా ఇబ్బందులకు లోను చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు పొత్తులతో, గ్యారెంటీ ల పేరుట అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని వారిని ప్రజలందరూ తరిమికొట్టాలని అన్నారు.
మే 13వ తారీఖున జరగబోయే సర్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటును వేసి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్న దొరగారికి వేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..





