విజయనగరం జిల్లాలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాలు
శ్రీయుత సంచాలకుల, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆంధ్ర ప్రదేష్ గుంటూర్ వారి  ఆదేశాల మేరకు, విజయనగరం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (DW&CW&EO) ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ పథకంలో భాగంగా పలు కీలక అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలలో జిల్లాలోని సి.డి.పి.ఓ.లు (CDPOs) మరియు సూపర్ వైజర్లు (Supervisors) పాల్గోన్నారు
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల వివరాలు:
1.చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల బాలికల ఆరోగ్యం, విద్య మరియు వారి భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బాలికలు తీవ్రమైన శారీరక మరియు మానసిక సమస్యలకు గురవుతున్నారని పేర్కొన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టాలని, బాలికల విద్యను ప్రోత్సహించాలని కోరారు. అలాగే, సమాజంలో ఎక్కడైనా బాల్య వివాహాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం వస్తే, తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని తెలియజేశారు మరియు టీనేజ్ preganancy పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసినదిగా మండల స్థాయి అధికారులకు తెలియజేసియున్నారు
2. పోక్సో (POCSO) చట్టం మరియు మానవ అక్రమ రవాణాపై అవగాహన: బాలల రక్షణే ధ్యేయంగా, లైంగిక నేరాల నుండి బాలలను రక్షించే పోక్సో (POCSO) చట్టం మరియు మానవ అక్రమ రవాణా (Trafficking) నివారణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బాలలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
3. జిల్లా స్థాయి మొక్కలు నాటే కార్యక్రమం (Plantation Day): పర్యావరణ పరిరక్షణలో భాగంగా “మొక్కలు నాటడం ఒక ఆశాజనకమైన పని” అనే నినాదంతో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ‘మన ప్రపంచాన్ని మనమే పచ్చదనంతో నింపుకుందాం’ అని తెలుపుతూ  ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రం లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించవసినదిగా అధికారులకు సూచించారు
ఈ కార్యక్రమాల్లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి (DW&CW&EO) శ్రీమతి కె.వి. బాలామణి, నోడల్ ఆఫీసర్ శ్రీ బి.టి. నాయుడు, జిల్లాలోని సి.డి.పి.ఓ.లు (CDPOs), సూపర్ వైజర్లు (Supervisors) మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఆడపిల్లల రక్షణ, విద్య మరియు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి