*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు* : స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో మంగళవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బాల భాస్కరావు గారు అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులు క్రిస్మస్ గీతాలు,నాటికలుతో అలపించారు.అలాగే ఏసు ప్రభువు జననం గురించి తెలుసుకునే విధంగా ముందస్తుగానే కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవరన్ సువార్త రాజు చీపురుపల్లి నుండి విచ్చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా విద్యార్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి క్రిస్మస్ పండుగ ప్రేమ,శాంతి, కరుణ,సోదరభావం వంటి విలువలను మనకు నేర్పుతుందిని తెలియజేశారు.మరియు అందరినీ ప్రేమించాలి,సహాయం చేయాలి,శాంతిగా జీవించాలి అనేది క్రిస్మస్ సందేశం అని తెలియజేశారు.అలాగే ఈ క్రిస్మస్ మీ జీవితంలో ఆనందం,ఆరోగ్యం,శాంతి తో నిండాలని కోరుకుంటూని తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ప్రేమ,శాంతి,కరుణ వంటి సందేశంతో వచ్చిన యేసు క్రీస్తు జన్మదినమే క్రిస్మస్ అని తెలియజేశారు.మరియు ద్వేషాన్ని విడిచిపెట్టి,సోదరభావంతో జీవించడమే నిజమైన క్రిస్మస్ అని తెలియజేశారు.అనంతరం కేక్ కట్ చేసి,కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ ప్రజల ముంగిటకే పాలన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే CMRF చెక్కులు అందజేసిన కిమిడి రామ మల్లిక్ నాయుడు చీపురుపల్లి లో నాకాబందీ కండక్ట్