18 వ జాతీయ మహాసభల సందర్భంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సెమినార్
సాలూరు మండల కార్యదర్శి సూర్య అధ్యక్షతన సాలూరు టౌన్ సీఐ గారు అప్పలనాయుడు గారు మాట్లాడుతూ.డ్రగ్స్ అనేవి ఒక చీడ పురుగు లాంటిది మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది అటువంటి డ్రగ్స్ ను మనమందరము కూడా వ్యతిరేకిద్దాం. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై ఇప్పటివరకు ఈ ఏడాది కాలంలో 118 మంది బాలికలపై అత్యాచారాలు జరిగాయి అంటే సగటు గా నెలకు 15 మంది బాలికలు అత్యాచారానికి గురవుతున్నారు. ఎంత కిరాతకంగా ఈ సమాజంలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ అత్యాచారాలను ఆపాలి అంటే డ్రగ్స్ ని, మద్యం ని, అరికట్టాలి అని అన్నారు.బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటివరకు ఎక్కువగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనిని ఇంకెవరు ఆపలేరు కేవలం విద్యార్థులు మాత్రమే ఆపగల రని అన్నారు. చాలామంది విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తెలియక ఘోర రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. మనం బండి మీద వెళ్లేటప్పుడు కొంచెం నెమ్మదిగా వెళ్లాలని తెలియజేశారు. 18 సంవత్సరాలు దాటి లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే వాహనాలు నడపాలని తెలియజేశారు.సాలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మేడం సత్యవతి గారు మాట్లాడుతూ.విద్యార్థి అన్న వాడు చదవాలి. అయితే బడిలో చెప్పేది మాత్రమే చదవటం కాదు సమాజం గురించి చదవాలి.సమాజం పట్ల అవగాహన ఉండాలి. సమాజం గురించి తెలుసుకోవలసిన అవసరం నేటి విద్యార్థులకు ఉంది. ఏమీ చదువుకోని వారు కూడా చాలా గొప్ప స్థానాల్లో ఉన్నారు. ఏం చదువుకున్నాం అని కాదు!ఎంత జ్ఞానం సంపాదించుకున్నాం అనేది చాలా విలువైనది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ మేడం గారు సత్యవతి గారు, తిరుపతి రావు గారు, A.S.I గారు పాల్గొన్నారు.సాలూరు పట్టణ అధ్యక్షులు శరత్, సాలూరు పట్టణ కమిటీ సభ్యులు ధనుంజయ్, శంకర్, వేణు, ఉదయ్, ఎలీషా, తదితరులు పాల్గొన్నారు.






