దివ్యాంగులు, గర్భిణిలు, వృద్ధులకు సేవలతో ప్రజలు మన్ననలు పొందిన “సేవాదళ్ పోలీసులు
మహాశివరాత్రి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాలలో ఫిబ్రవరి 15న తెల్లవారుజామునుండే భక్తులు దర్శనాలకు వస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ గారి ఆదేశాలమేరకు దర్శనాలకు వచ్చిన భక్తులకు సేవాదళ్ పోలీసులు విశేషమైన సేవలందిస్తూ, ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మహా శివుడిని దర్శించేందుకు విచ్చేసిన వృద్ధులు, గర్భిణిలు, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన సహాయ, సహకారాలను విజయనగరం జిల్లా పోలీసులు సేవాదళ్ పేరుతో సేవలందిస్తున్నారు. నడవలేని దివ్యాంగులను వీల్ చైర్లో, తమ భుజాలపై దర్శనంకు తీసుకొని వెళ్ళి, దర్శనం అయ్యే విధంగా చర్యలు చేపట్టడంతో దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణిల నుండి ప్రశంసలు లభించాయి. సేవాదళ్ పోలీసులు సేవలందించేందుకు వీల్ చైర్స్ను కూడా అందుబాటులో ఉంచారు. జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాలతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సేవాదళ్ పోలీసులు అందిస్తున్న సేవల పట్ల భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.






