పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఏడవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం నాలుగు గంటల నుండి అమ్మవారి అలంకరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో తల్లిదండ్రుల తో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. అమ్మవారికి నాగులకొండ జేజి రావు గారి దంపతులు వెండితో చేసిన అష్టలక్ష్మి కలశాన్ని మరియు పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం అమ్మవారు ఆలయంలో అన్న సమారాధన కార్యక్రమానికి అన్న ప్రసాదాలు సిద్ధమవుతున్నాయని ఎడతెరిపిలేని వర్షాలను కూడా లెక్కచేయకుండా అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తున్నారని సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు ఆలయ భక్త బృంద సభ్యులు తెలిపారు










