ఉత్తరాంద్ర ఇలవేల్సు భక్తుల కొంగు బంగారం శ్రీ శంబర పోలమాంబ సిరిమానోత్సవం కన్నుల పండగగా జరిగింది. భక్తుల జేజే ద్వానాల మద్యఅమ్మవారికి ప్రతిరూపమైన సిరిమాను రథం శంబర పురవీధుల్లో ముమ్మారు ఊరేగింది. ఉత్తరాంద్ర జిల్లాలతో పాటు ఒడిషా, చత్తీష్‌గడ్ నుండిభారీగా తరలివచ్చిన భక్త జన సంద్రాంగం సిరిమాను రూపంలో ఉన్న అమ్మవారుదీవించింది. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండాపోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడంతో సిరిమాను సంబరం ప్రసాంతంగా ముగిసింది.పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామం భక్తజన సంద్రంగా మారింది. శ్రీపోలమాంబ ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవాన్నిఅత్యంత వైభవంగా నిర్వహించారు.2023 సంవత్సరం నుండి సంబర పోలమాంబ జాతరను రాష్ట్ర పండగగా ప్రకటించడంతో దేవాదాయ శాఖ తో పాటు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి ప్రారంభమైన పోలమాంబ జాతరకు భక్తులు పెద్దెత్తున తరలివచ్చి నిన్న రాత్రినుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పార్వతీపురం మన్యంతో పాటు విజయనగరం, శ్రీకాకులం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిషా, చత్తీష్‌గడ్, రాష్ట్రాలనుంచిభారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శంబర భక్తులతో కిటకిటలాడుతూ దర్శనమిచ్చింది. అమ్మవారి మ్రెక్కులు తీర్చుకునేందుకు భారీగాక్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దీంతో అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది.దాదాపుగా రెండురోజుల వ్యవధిలో 2లక్షలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భక్తుల ఆశలకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతోభారిగా తరలివచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కున్నారు.అయితే అమ్మవారి మ్రెక్కులు తీర్చుకునేందుకు భక్తులు సమస్యలను అదిగమించి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా అమ్మవారి జాతరలోప్రధానమైన సిరిమానోత్సవం మద్యాహ్నం 4 గంటల సమయంలో ప్రారంభమైంది. సిరిమాను రథాన్ని ఆలయ ప్రధాన పూజారి జన్నికాపు భాస్కరరావుఅధిరోహించారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిరిమాను రథం భక్తుల జేజే ద్వానాల మద్య శంబరపురవీధుల్లో ఊరేగేందుకు ముందుకు కదిలింది. పెద్దెత్తున సిరిమాను ఉత్సవాన్ని తిలకిస్తున్న భక్తులను ఆశీర్వదించి సిరిమాను రథం శంబర వీధుల్లోమూడు సార్లు ఊరేగింది. ఈ క్రమంలో అమ్మవారికి ప్రత్యక్ష రూపమైన సిరిమానును తిలకించి భక్తులు భక్తిపారవశ్యానికి గురయ్యారు. అమ్మవారికిభక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.దీంతో ప్రధాన ఘట్టమైన అమ్మవారి సిరిమాను శంబరం అంగరంగవైభంగా ముగిసింది. మొత్తం 3లక్షల మందిసిరిమాను ఉత్సవాన్ని తిలకించినట్లుగా అధికారులు అంచనాలు వేస్తున్నారు. మరోవైపు భారీగా భక్తులు హాజరైన నేపద్యంలో గట్టిబందోబస్తుచేయడంతో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో అదికార యంత్రాంగా ఊపిరిపీల్చుకున్నారు. భారీగా తరలివచ్చినభక్తులకు తగినట్లు ఏర్పాట్లు చేయడంలో దేవాదాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. సుదీర ప్రాంతాలనుంచి భారీగా భక్తులు హాజరవుతారనితెలిసినప్పటికి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో దేవాదాయ శాఖ యంత్రాంగం శ్రద్దవహించలేదు. దీంతో భక్తలుకు ఇబ్బందులు తప్పలేదుమొత్తంమీద సిరిమాను సంబరం ప్రశాంతంగా ముగిసింది.అమ్మవారిని పరువులు ప్రముఖులు దర్శించుకున్నారు. Spread the love టపా నావిగేషన్ రిషి విద్యాసంస్థల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర