పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ గారు సాలూరు టౌన్, స్టేషన్ పరిశరాలలో వున్నా సిఆర్పిఎఫ్ బారక్ను మరియు సాలూర్ సర్కిల్ ఆఫీస్,రూరల్ పోలీసు స్టేషన్లు సందర్శించి స్టేషన్ ప్రాంగణం,చుట్టుపక్కల పరిసరాలను మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ చుట్టూవున్న పరిసరాలను ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందన్నారు..అనంతరం పోలీసు స్టేషను సిబ్బందితో మమేకమై,వారు నిర్వహించే విధులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ కౌంటర్ మరియు స్టేషన్లో గల వివిధ రికార్డులను పరిశీలించి, నమోదైన కేసులపై ఆరా తీసినారు. పెండింగ్ కేసులు దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదని ఆరా తీసి సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధానాలపై ఎస్పీ గారు పలు సూచనలు,సలహాలు ఇచ్చినారు. విధిగా వాహన తనిఖీలు,విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి గంజాయి,నాటుసారా అక్రమ రవాణా నియంత్రకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసారు.
జిల్లా ఎస్పీ గారు సందర్శించిన సమయంలో సాలుర్ టౌన్ సిఐ సిఎచ్.వాసునాయుడు,సాలూర్ రూరల్ సిఐ జి.బాలకృష్ణ, రూరల్ ఎస్సైఎం.వి.రమణ గార్లు, సిఆర్పిఎఫ్ అధికారులు మరియు సిబ్బంది హాజరుగా ఉన్నారు