సాలూరు పట్టణం లో ఉగాది పర్వదినాన శ్రీ సీతా రాములు విగ్రహ ఊరేగింపు జరిగింది. పట్టణ డబ్బీవీధి వెలమపేట ప్రాంతాలలో శ్రీరామ నవమి సందర్భం గా నేటి నుంచి నవమి వరకు సీతారాములకి రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు కార్యక్రమం లో సాలూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్య రాణి పాల్గొని స్వామి వారి రథాన్ని లాగరు భక్తులతో కలసి కోలాటం ఆడారు.