Congratulations sruthi

ఏపీ ఎంసెట్ ఫలితాలలో సత్తా చాటిన ఏలుదూటి శృతి

2024 సంవత్సరం జరిగే ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలలో సాలూరు పట్టణానికి చెందిన ఏలుదూటి శృతి అను విద్యార్థిని తన ప్రతిభను చూపించారు. ఏపీ ఎంసెట్ బి సి డి కేటగిరి విభాగంలో 314 వ ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి న విద్యార్థిని ఏలుదూటి శృతి సి విశాఖపట్నం శ్రీ విశ్వ జూనియర్ కళాశాల డీన్ మరియు అధ్యాపకులు, కుటుంబ సభ్యులు అభినందించారు. సాలూరు పట్టణానికి చెందిన ఏలుదూటి సురేష్ రాజు, బలగ రాధల దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. వీరిలో కుమారుడు ఎలుదూటి రాహుల్ రాజ్ జాతీయస్థాయి నీట్ పరీక్షలలో ఉత్తమమైన ర్యాంకు సాధించి ప్రస్తుతం కాకినాడ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అన్న బాటలోనే చెల్లెలు కూడా అన్నట్టు ఏలుదూటీ శృతి కూడా చిన్నప్పటినుండి వైద్యరంగంపై ఆసక్తి పెంచుకోవడంతో 2024 వ సంవత్సరం జాతీయ స్థాయి నీట్ పరీక్షలలో ఉత్తమైన మార్కులు సాధించి  ఎంబిబిఎస్ సీటు సంపాదించు కోవడంతో పాటు ఏపీ ఎంసెట్లో కూడా ఉత్తమమైన ర్యాంకును ఆమె చేజిక్కించుకుంది. ఎలుదూటి శృతి తండ్రి సురేష్ రాజు విశాఖ బీ హెచ్ పి వి ఈ ఎల్ కంపెనీలో మెల్ నర్స్ గా పనిచేస్తున్నారు. ఈమె తల్లి బలగ రాధ సాలూరు పట్నంలో స్థానిక రామ కాలనీలో అంగన్వాడి కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తూ,  స్పూర్తి మహిళా మండలి డైరెక్టర్ గా ఉంటూ సామాజిక సేవలు అందిస్తూ పిల్లల్ని చక్కని నడవడికలో నడిపించి ఉన్నతమైన చదువులను చదివించాలనేదే ఆ తల్లి యొక్క లక్ష్యం. ఎలుదూటి శృతి ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు సాలూరులో రవీంద్ర భారతి పాఠశాలలో విద్యను అభ్యసించారు. అనంతరం ఇంటర్మీడియట్ కోర్సును విశాఖపట్నం శ్రీ విశ్వ జూనియర్ కళాశాలలో బైపిసి కోర్సు లో జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ లో కూడా స్టేట్ ర్యాంకు సంపాదించడంతో ఆయా కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు ఆ విద్యార్థినికి ప్రశంస పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఏపీ ఎంసెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు రావడం పట్ల ఆమెను తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *