చెడు అలవాట్లకు దూరం కండి……. సమాజాభివృద్ధికై ఆలోచించండి……….. యువతకు పిలుపునిచ్చిన స్ఫూర్తి మహిళా మండలి రాష్ట్ర డైరెక్టర్……….. చెడు అలవాట్లకు దూరం కండి… సమాజాభివృద్ధికై ఆలోచించండి అని స్ఫూర్తి మహిళా మండలి రాష్ట్ర డైరెక్టర్, గ్లోబల్ స్ఫూర్తి డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు బలగ.రాధ నాయుడు పిలుపునిచ్చారు. బుధవారం సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు పరిచయ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్ నుండి ఎవేర్నెస్ కార్యక్రమాలు ఎంతో అవసరమని విద్యార్థులు విద్య పైన దృష్టి పెట్టాలంటే విద్యార్థులు చదువును పక్కన పెట్టకుండా ఎలా వారి యొక్క మానసిక పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలోఅనే వాటి పైన ఈ ప్రథమ పరిచయ కార్యక్రమాన్ని వారం రోజులు పాటు విద్యార్థులకు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బలగ రాధా నాయుడు యువత సమాజంలో ఎలా నడుచుకోవాలో అనే విషయంపై మాట్లాడుతూ విద్యార్థులు ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్,వాట్సాప్ లాంటి సోషల్ మీడియా కి అలవాటుపడటమే కాకుండా ఆన్లైన్ బెట్టింగ్స్, డ్రగ్స్ కి అలవాటు పడి వారి బంగారు భవిష్యత్తును బూడిద చేసుకుంటున్నారన్నారు. అలాగే సోషల్ మీడియాలో తెలియని వ్యక్తితో పరిచయాలు పెంచుకొని అమ్మాయిలు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని సమాజాన్ని నాశనం చేసే వీటి పట్ల యువత దూరంగా ఉండి చదువునే దైవంగా భావించి జీవిత ఆశయాన్ని సాధించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తెచ్చి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలన్నారు.ప్రేమ పేరుతో ప్రలోభాలకి లోనయ్యి జీవితాన్ని నాశనం చేసుకోకుండా సత్ప్రవర్తనతో మెలిగి ఒక అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులుగా మిగిలిపోవాలని ఆకాంక్షించారు.నేడు సమాజం అభివృద్ధి దశగా వెళ్తున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలలో చేతబడి, పసర మందు తదితర వాటికి ప్రజలు ఆకర్షితులై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని మూఢనమ్మకాలు పట్ల యువత గ్రామాలలో అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని అటువంటి కార్యక్రమాలకి మా గ్లోబల్ స్ఫూర్తి డెవలప్మెంట్ సొసైటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు రాధా నాయుడు ను దుస్సాలు వాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ చిరంజీవి వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్ నాయుడు విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి