సాలూరు పట్టణ పరిధిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లైన మామిడిపల్లి జంక్షన్, గాంధీనగర్ జంక్షన్ మరియు బైపాస్ రోడ్ ప్రాంతాలను సంయుక్తంగా పరిశీలించడం జరిగింది.ఈ తనిఖీలను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ జె.వి.ఎస్.ఎస్.ఎస్. ప్రసాద్ గారు, ఆర్ & బి శాఖ AEE సాలూరు శ్రీ విజయ్‌కుమార్ గారు మరియు సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు కలిసి నిర్వహించారు.ప్రమాదాలను నివారించేందుకు క్రింది చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు:• జంక్షన్ల వద్ద దిశా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం• స్పీడ్ లిమిట్, ప్రమాద ప్రాంతం, మలుపు సూచిక వంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం• జీబ్రా క్రాసింగ్‌లు, స్టాప్ లైన్లు మరియు స్పీడ్ బ్రేకర్లపై రిఫ్లెక్టివ్ పెయింటింగ్ చేయడం• జంక్షన్ ముందు రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించడం• తగినంత వీధి దీపాల ఏర్పాటు• రోడ్డు పక్కన కనిపించే దృశ్యాన్ని అడ్డుకుంటున్న పొదలు, మొక్కలను తొలగించడం• బ్లైండ్ కర్వ్‌లు మరియు జంక్షన్ల వద్ద కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేయడం• మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు• బైపాస్ రోడ్ పై భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక పర్యవేక్షణ Spread the love టపా నావిగేషన్ మెనూ పాటించకపోతే కఠిన చర్యలు