పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ దండిగాం గ్రామంలో చెడ్డ పోలమ్మ ఎర్రయ్య దంపతులకు కూతురు పార్వతి అలియాస్ జ్యోతి (19 ) ఈమె పదవ తరగతి వరకు పాచిపెంట మండలం సరాయివలస ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో చదివింది ఆ తరువాత దండిగాం గ్రామంలోనే తన నివాసం వద్ద ఉంటున్నది ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఉంటుందని తల్లి మందలించడంతో మనస్థాపం గురై సుమారుగా 22 రోజుల నుండి 25 రోజులు మధ్యలో ఇంటి నుండి వెళ్లిపోయింది ఎక్కడో బంధువులు ఇంటిదగ్గర ఉన్నారని తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ కూడా పోలీసులకు ఇవ్వలేదని ఆ గ్రామం సంబంధించిన ఒక వ్యక్తి ఈరోజు దండిగాం గ్రామానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో కొండపైన చెట్టుకు వేలాడుతున్న మృత దేహాన్ని చూడటం జరిగిందని ఈ ప్రాంతం ఊరికి దూరంగా ఉండటం వలన ఎవరు ఇంతవరకు గుర్తించలేకపోయారు సుమారు 22 రోజులు క్రితము సూసైడ్ చేసుకున్నట్లు ఆ బాడీని చూస్తే కనిపిస్తుందని తల్లి తండ్రుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
