మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా

మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా



చీపురుపల్లి నియోజకవర్గంలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా, ప్రత్యేక ముద్రతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం.

చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఒక సిండికేట్ గా ఏర్పడి రోజువారి భవన కార్మికులు,రైతు కూలీలు సేవించే చీప్ లిక్కర్  పై ప్రత్యేక ముద్రతో అదనంగా ఒక్కొక్క సీసాపై పది రూపాయలు పెంచి ప్రతి పల్లె పల్లెకు బెల్ట్ షాపుల ద్వారా విక్రయించే అక్రమ దందాకు తెరలేపారని  జనసేన పార్టీ దృష్టికి తెలియ వచ్చినది.ఈ సందర్భంలో ఈ రోజున చీపురుపల్లి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సి.ఐ వారి కి రాతపూర్వక రిపోర్టు విన్నపములను అందించడం జరిగింది.

ఈ విధంగా పేదవాడు తాగే చీప్ లిక్కర్ పై అదనంగా పది రూపాయలు MRP రేట్ కంటే పెంచి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ పేదవాడు తాగే చీప్ లిక్కర్ పై అదనపు భారాన్ని వేసి, వారి కుటుంబాలను దోచుకు తింటున్న, అక్రమంగా మద్యం రేటు పెంచి అమ్ముతున్న షాపులపై విచారణ జరిపించి లైసెన్సులు రద్దుచేసి సంబంధిత వారిపై  చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు, చీపురుపల్లి టిడిపి నాయకులు రౌతు షణ్ముఖరావు గారు, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి