విజయనగరం జిల్లాలో మద్యం అమ్మకాల్లో సిండికేట్లు దందా, మద్యం సీసాలపై ప్రత్యేక ముద్రతో పల్లెల్లో బెల్ట్ షాపుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లిన చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు కోట్ల కృష్ణ
విజయనగరం జిల్లాలో మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ఒక సిండికేట్ గా ఏర్పడి రోజువారి భవన కార్మికులు,రైతు కూలీలు సేవించే చీప్ లిక్కర్ పై ప్రత్యేక ముద్రతో అదనంగా ఒక్కొక్క సీసాపై పది రూపాయలు పెంచి ప్రతి పల్లె పల్లెకు బెల్ట్ షాపుల ద్వారా విక్రయించే అక్రమ దందాకు తెరలేపారని జనసేన పార్టీ దృష్టికి తెలియవచ్చినది.ఈ సందర్భంలో ఈ రోజున విజయనగరం జిల్లా కలెక్టర్ వారికి రాతపూర్వక రిపోర్టు విన్నపములను అందించడం జరిగింది.
అందులో భాగంగా జిల్లాలో పేదవాడు తాగే చీప్ లిక్కర్ పై అదనంగా పది రూపాయలు MRP రేట్ కంటే పెంచి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ పేదవాడు తాగే చీప్ లిక్కర్ పై అదనపు భారాన్ని వేసి, అక్రమంగా మద్యం రేటు పెంచి అమ్ముతున్న షాపులపై విచారణ జరిపించి లైసెన్సులు రద్దుచేసి సంబంధిత వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు గారు కోరారు. అనంతరం స్పందించిన గౌరవ కలెక్టర్ గారు తక్షణమే అక్రమ మద్యం అమ్మకాల షాపుల లైసెన్స్ రద్దుచేస్థామని అలాగే ఎటువంటి సమాచారం ఉన్న మా దృష్టి తీసుకు వచ్చిన వెంటనే తప్పక స్పందించి సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దంతులూరి రమేష్ రాజు, జనసేన గుర్ల మండల పార్టీ అధ్యక్షులు యడ్ల సంతోష్ , గరివిడి జనసేన నాయకులు యడ్ల రమణ, జిల్లా నాయకులు తుమ్మి అప్పలరాజుదొర ,
చీపురుపల్లి టిడిపి నాయకులు రౌతు షణ్ముఖరావు , మీసాల సూర్య నాయుడు, సత్యం మరియు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు



