తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గత ఐదేళ్ల అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అద్భుతమైన కృషిని అభినందించారు. ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను ముందుకు తీసుకెళ్తుందని మంత్రివర్యులు పేర్కొన్నారు.
తెలుగు ప్రజల అభివృద్ధి మరియు ఆత్మగౌరవం కోసం 43 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న తెలుగుదేశం పార్టీ, ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని పని చేస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, *పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ విగ్రహం వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి గారు పాల్గొని, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు*.
కార్యక్రమంలో భాగంగా, పార్టీ కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న 43 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మంత్రి గౌరవప్రదంగా సన్మానించారు. వారి అంకితభావాన్ని గుర్తించి, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించారు.
అదేవిధంగా, *మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడి రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు, పేద మహిళలకు చీరలను అందజేశారు*. ప్రజలకు సేవ చేయడమే నిజమైన రాజకీయ సేవ అని పేర్కొంటూ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించి, తెలుగుదేశం పార్టీ ముందున్న లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉండాలని ప్రతి కార్యకర్తను ఉద్భోదించారు.





