విజయనగరం జిల్లా చీపురుపల్లి లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షిక జాతర చీపురుపల్లిలోని ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 28వ జాతర ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. దీనికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా శివరాత్రి తరువాత వచ్చే ఆదివారం ప్రారంభమై మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పట్టణ శివారున విశాల ప్రాంగణంలో అమ్మవారి దేవస్థానం ఉండటంతో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తుంటారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు దేవస్థానం లో అమ్మవారిని అలంకరించి, మొదటి పూజను నిర్వహించి జాతరను ప్రారంభించనున్నారు. వార్షిక జాతర సందర్భంగా చీపురుపల్లి శాసన సభ్యులు కిమిడి కళావెంకటరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర నేపథ్యంలో చీపురుపల్లి పట్టణంలో నూతన శోభ సంతరించుకుంది. విద్యుత్తు దీపాల అలంకరణతో పట్టణం శోభాయమానంగా తీర్చదిద్దారు. మూడు రోజులు పాటు వివిధ రకాల సాంకృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి .అమ్మవారి దేవస్థానం నుంచి శ్రీకాకుళం రహదారి మీదుగా మూడు రహదారుల కూడలి, విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారుల పొడుగునా విద్యుత్తు దీపాలతో అలంకరించారు.మూడు రోజుల పాటు మూడు నుండి ఐదు లక్షల వరకు భక్తులు హాజరై అమ్మవారిని దర్శించి, జాతరను తిలకించనున్నారని అంచనా. ఏపీ, తెలంగాణ, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాల రీత్యా వెళ్లిన వారంతా విధిగా హాజరవుతుంటారు. Spread the love టపా నావిగేషన్ వసుంధర వాల్యూమ్ – 3″ అనే మ్యాగజైనను డాక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కే కృష్ణమూర్తి