సుప్రీం కోర్టు మార్గదర్శికాలను, హైకోర్టు తీర్పులను పరిగణములోకి తీసుకోకుండా అధికారులే చెరువును డంపింగ్ యార్డ్ రీసైకిల్ వేస్ట్ తో కప్పుతున్నారు చెరువులు కనుమరుగవటానికి కారణమవుతున్న అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి నిన్న గాక మొన్న స్థానిక ఎమ్మెల్యే పార్వతీపురం మున్సిపాలిటీ లోని నెల్లిచెరువు కబ్జాకు గురైందని అసెంబ్లీలో చెప్పారు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ చెరువులను ఆక్రమణల నుండి పరిరక్షించాల్సిన బాధ్యత తాసిల్దారుల దే అని చెప్పి ఒక్క రోజు కూడా కాలేదు పార్వతీపురం నడి బొడ్డున కలెక్టరేట్కు కూత వేటు దూరంలో ఉన్న నెల్లిచెరువును అత్యంత దారుణంగా డంపింగ్ యార్డ్ రీ సైకిల్ వేస్ట్ తో ఈ విధంగా కప్పుతున్నారు అసెంబ్లీలో ప్రస్తావించిన దానికే రక్షణ లేకపోతే చట్టసభలపై ప్రజలకు నమ్మకం కోల్పోదా ? జిల్లా మెజిస్ట్రేట్ అధికారాలు ఉన్న జిల్లా కలెక్టర్ చెప్పిన రోజే కలెక్టరేట్ కు కూత వేటు దూరంలో చెరువును కనుమరుగు చేయటం ప్రజలకు ఏ సంకేతాలు వెళ్తాయి ఈ విధంగా చెరువు కప్పటానికి కారణమైన వారిపై సుమోటోగా కేసు నమోదు చేసి కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా ఉంది ఈరోజు ప్రభుత్వ ఆస్తులను, చెరువులను కాపాడుకో లేకపోతే.. భవిష్యత్తులో ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిన ఆశ్చర్యపోనవసరం లేదు,పరిస్థితి ఆ స్థాయికి దిగజారకముందే ప్రజలారా కళ్ళు తెరవండి మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి లేదంటే మన మనుగుడితో పాటు , దేశ మనుగడ కూడా ప్రమాదంలో పడుతుందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగరపు ఈశ్వర్ ప్రసాద్ , వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లు సత్యం, వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు తెలియజేశారు Spread the love టపా నావిగేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు