_*చీపురుపల్లి నియోజకవర్గం., 01.01.2026*.._
*_నూతన సంవత్సర వేడుకలు – గరివిడి.._*
_గరివిడిలో మిన్నంటిన నూతన సంవత్సర వేడుకలు: KAR ఫంక్షన్ హాల్‌కు పోటెత్తిన జనవాహిని.._
_ప్రజల మధ్యనే నూతన సంకల్పం: ఎమ్మెల్యే కళావెంకటరావు గారు మరియు యువనేత రామ మల్లిక్ నాయుడు గారికి వెల్లువలా శుభాకాంక్షలు.._
_జనసంద్రమైన చీపురుపల్లి నియోజకవర్గం.._
_అభిమాన జనసందోహం..
గరివిడిలోని KAR ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన నూతన సంవత్సర వేడుకలకు చీపురుపల్లి నియోజకవర్గంలోని నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు.._
_స్థానిక ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారు యువనేత, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. భారీ పూలమాలలు, బొకేలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.._
_ప్రజలతో మమేకం.._
_వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే గారు ఆత్మీయంగా పలకరిస్తూ, కొత్త ఏడాదిలో నియోజకవర్గ అభివృద్ధికి మరింత అంకితభావంతో పని చేస్తామని భరోసా ఇచ్చారు.._
_పండుగ వాతావరణం.._
_KAR ఫంక్షన్ హాల్ ప్రాంగణం మొత్తం జైత్రయాత్రను తలపించింది. కార్యకర్తల కేరింతలు, బాణాసంచా కాల్పులతో గరివిడి పట్టణం పండుగ శోభను సంతరించుకుంది.._
_గరివిడి: చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని KAR ఫంక్షన్ హాల్‌లో 2026 నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు గారికి యువనేత, రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారికి శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గ ప్రజలు వెల్లువలా పోటెత్తారు. ఉదయం నుండే ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది.._
_యువనేత నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని, అభిమానాన్ని ప్రజలు ఈ సందర్భంగా చాటుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ.. ప్రజల ప్రేమాభిమానాలే తమకు కొండంత అండ అని, రాబోయే రోజుల్లో చీపురుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు శ్రమిస్తానని పేర్కొన్నారు.._
_ఈ కార్యక్రమంలో నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, అధికారులు, మరియు భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారు.._







