*పేదరికం లేని సమాజమే లక్ష్యం పి4తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు*

*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు*

: పేదరికం లేని సమాజమే లక్ష్యం: ‘పి4’తో మారనున్న ‘బంగారు కుటుంబాల’ తలరాతలు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన  పి 4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పి4’ కార్యక్రమం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.  ఈ కార్యక్రమం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా, తిరుపతిలో ముఖ్యమంత్రి నిర్వహించిన ఆన్‌లైన్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 9.5 లక్షల మంది రిజిస్ట్రేషన్.. 5 లక్షల మందికి లబ్ధి సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది సహాయం కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో సహాయం కోరిన వీరిని ప్రభుత్వం బంగారు కుటుంబాలుగా గుర్తించింది. ప్రభుత్వ చొరవతో, దాతలను (మార్గదర్శకులు) ఈ కుటుంబాలతో అనుసంధానం చేయడం ద్వారా కేవలం ఏడాది కాలంలోనే 5 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు.
పి3 నుంచి పి4 వరకు ఒక ప్రస్థానం గతంలో ప్రభుత్వం మరియు ప్రైవేటు భాగస్వామ్యం  ద్వారా రోడ్లు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీనికి ‘ప్రజలను కూడా జోడించి P4 గా మార్చారని వక్తలు వివరించారు.

1995లో ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం తరహాలోనే, ఇప్పుడు సమాజంలోని ధనవంతులు, పారిశ్రామికవేత్తలు పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి. పార్వతీపురం వంటి గిరిజన మరియు వెనుకబడిన జిల్లాల్లో పారిశ్రామికవేత్తల కొరత ఉన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్న.
ఇక్కడ స్థానిక మార్గదర్శకులు తక్కువగా ఉన్నందున విశాఖపట్నం వంటి నగరాల నుండి లేదా రాష్ట్ర స్థాయి నుండి పెద్ద ఎత్తున దాతలను ఈ జిల్లాలోని బంగారు కుటుంబాలకు అటాచ్ చేస్తాం.

ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, ఒక సామాజిక బాధ్యత అని నేతలు స్పష్టం చేశారు. “డబ్బు ఉన్నవాడు మరింత సంపాదిస్తున్నాడు, పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడమే పి4 లక్ష్యం, అని వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై, కనీసం 10 కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు.

పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, ఇతర సామాజిక సేవలలో మెరుగుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధి వంటి లక్ష్యాలను పి -4 ద్వారా సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదని అన్నారు. అట్టడుగున ఉన్న పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన పీ4 కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు… పేదలకు చేయూతను అందించేలా పీ4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు సంపన్నవర్గాలు ముందుకొస్తున్నారు.

*పేదరిక రహిత సమాజమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ డాక్టర్‌ ఎన్. ప్రభాకర రెడ్డి*

*ప్రతీ కుటుంబానికి అండగా ‘P4’ కార్యక్రమం*

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 (People Performance Pride Partnership) కార్యక్రమం పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా సాగుతోందని కేవలం పథకాలు ప్రకటించడమే కాకుండా, ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చడమే ‘P4’ ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. “బంగారు కుటుంబం” పేరుతో ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో ఎవరికి ఏ సహాయం అవసరమో స్పష్టంగా ఉందని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారు సచివాలయాల ద్వారా తమ వంతు సాయం అందించవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్నాయని, పేదలకు ఈ సేవలు అందేలా చూడాలని కోరారు. ఎన్టీఆర్ వైద్యసేవ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా అత్యవసర వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోందని, ఎమ్మెల్యేల సహకారంతో అనేక మందికి ఇప్పటికే లబ్ధి చేకూరిందని గుర్తుచేశారు. జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించడానికి ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్ షిప్’ కింద ఇప్పటికే 5 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. వీరికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు, అవసరమైన శిక్షణను ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.

సహాయం అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదని, సరైన సలహా (నైపుణ్యం) లేదా మార్గనిర్దేశం చేయడం కూడా గొప్ప సేవ అని ఆయన అన్నారు. “సినిమాలో హీరోలు చేసే సాహసాలను చూసి చప్పట్లు కొట్టడమే కాదు, నిజ జీవితంలో పది మందికి మేలు చేసి ఆ తృప్తిని పొందాలి” అని ఆయన స్ఫూర్తిని నింపారు.

*పార్వతీపురం సేవలు రాష్ట్రానికే ఆదర్శం*

*P4 పథకంతో మారుతున్న ప్రజల జీవన ప్రమాణాలు*

పార్వతీపురం శాసన సభ్యులు బొనేల విజయచంద్ర మాట్లాడుతూ ఒక చిన్న చొరవ సమాజంలో పెద్ద మార్పును తీసుకురాగలదు అనే నినాదంతో పార్వతీపురంలో సాగుతున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. స్థానిక నాయకులు మరియు స్వచ్ఛంద సేవకుల కృషిని వివరిస్తూ, రాబోయే కాలంలో పార్వతీపురం జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యమని ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు సామాన్య వ్యక్తులు చేస్తున్న అసాధారణ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు
ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు అతి తక్కువ ధరకే భోజనం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తనకిచ్చే ₹8,000 గౌరవ వేతనంలోనే ఈ సేవలు చేయడం అందరికీ స్ఫూర్తిదాయకం. బి.ఎన్. రావు గారు ఆశాజ్యోతి ఆశ్రమం ద్వారా దాదాపు 40 మంది అనాథ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ వారికి అండగా నిలుస్తున్నారు. గౌరీ శంకర్ గారు శ్మశాన వాటికను దత్తత తీసుకుని, దానిని ఒక పూదోటలా తీర్చిదిద్దడమే కాకుండా, గుర్తుతెలియని మృతదేహాలకు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ అరుదైన సేవ చేస్తున్నారు. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పార్వతీపురంలోని ‘బంగారు కుటుంబాలు’ మరియు ‘మార్గదర్శులతో’ నేరుగా మాట్లాడనున్నారని సమాచారం. ప్రస్తుతం P4 పథకం అమలులో రాష్ట్రంలో టాప్ 15లో ఉన్న పార్వతీపురం, వచ్చే ఏడాది నాటికి మొదటి మూడు స్థానాల్లో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మరియు సేవలను ఇతర జిల్లాలకు కూడా ‘కేస్ స్టడీస్’గా చూపిస్తూ, పార్వతీపురాన్ని ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతీ పేదవాడికి సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు.

జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని నిరుపేద కుటుంబాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 78,464 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు జెసి తెలిపారు. ఈ కుటుంబాలకు సరైన దిశానిర్దేశం చేసి, ప్రభుత్వ ఫలాలను చేరవేసేందుకు 2,998 మంది మార్గదర్శకులు నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు.


*ఒంటరి మహిళకు అండగా నిలుస్తున్న రవణమ్మ*

మానవత్వానికి నిలువుటద్దంగా నిలుస్తూ, తోటివారి కష్టాల్లో పాలుపంచుకుంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన రవణమ్మ. ‘బంగారు కుటుంబం’ కార్యక్రమంలో భాగంగా ఆమె ఒక నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకుని, వారికి అన్ని వేళలా అండగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

బలిజిపేట మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన రవణమ్మ ప్రస్తుతం వెలుగు ఆఫీస్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. తన గ్రామంలోనే నివసిస్తున్న ఎస్. గౌరమ్మ అనే వృద్ధురాలి దీనస్థితి రవణమ్మను కదిలించింది. భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న గౌరమ్మ, గతంలో నాగుపాము కాటుకు గురయ్యారు. ఆ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, శరీరంలో విషప్రభావం వల్ల ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కనీసం కొద్ది దూరం కూడా ప్రయాణించలేని స్థితిలో ఉన్న ఆమెకు రవణమ్మ అండగా నిలిచారు.

ఈ సేవా కార్యక్రమం గురించి తెలుసుకున్న జిల్లా అధికారులు రవణమ్మను ప్రత్యేకంగా అభినందించారు. ఒక సామాన్య ఉద్యోగిని అయ్యుండి కూడా, ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆదుకోవడంపై విచారించి, ఆమె అందిస్తున్న ఆర్థిక మరియు ఇతర సహాయ సహకారాలను కొనియాడారు.

ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి నిర్మాణంలో గౌరమ్మకు రవణమ్మ చేదోడు వాదోడుగా నిలిచారు. గౌరమ్మ ఆరోగ్య సమస్యలకు సంబంధించి మరియు నిత్యం ఆహార అవసరాల విషయంలో రవణమ్మ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గౌరమ్మకు ఏ చిన్న కష్టం వచ్చినా రవణమ్మనే ఆశ్రయించేంతటి ఆత్మీయ బంధం వీరి మధ్య ఏర్పడింది. నాకున్నంతలో ఒకరికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుటుంబాన్ని దత్తత తీసుకున్నాను” అని రవణమ్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

*సామాన్య కూలీ బిడ్డకు అండగా నిలిచిన ఎమ్మెల్యే*

పేదరికం నుంచి ధనిక వర్గంలోకి పేదలను చేర్చడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన ‘P4’ (Poverty to Prosperity) సిద్ధాంతం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఒక సామాన్య రోజువారీ కూలీ కుటుంబంలో ఈ పథకం వెలుగులు నింపింది. కూలీ బిడ్డకు ఇంజనీరింగ్ కల పార్వతీపురం టౌన్‌కు చెందిన హనుమంతు శంకర్ రావు అనే వ్యక్తి రోజుకు ₹600 నుండి ₹700 సంపాదించే సామాన్య కూలీ. తన పెద్ద కుమార్తెకు ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ, ఏడాదికి అయ్యే వేల రూపాయల కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చులు భరించలేక ఆమె చదువును మాన్పించే పరిస్థితిలో ఉన్నారు.
దత్తత తీసుకున్న ఎమ్మెల్యే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు గారి P4 కాన్సెప్ట్‌లో భాగంగా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని మాట ఇచ్చారు. బిట్స్ బాబా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి, లక్ష రూపాయల ఫీజును కేవలం ₹34,000కు తగ్గించారు. ఆ మిగిలిన ఫీజును కూడా ఎమ్మెల్యే గారే స్వయంగా చెల్లిస్తూ ఆ విద్యార్థిని చదువుకు అండగా నిలిచారు.
అర్ధరాత్రి వేళ లాప్‌టాప్ అందజేత ఇంజనీరింగ్ చదువుకు అత్యవసరమైన ₹75,000 విలువైన హై-ఎండ్ లాప్‌టాప్‌ను కూడా ఎమ్మెల్యే గారు సమకూర్చారు. శంకర్ రావు అభ్యర్థించిన వెంటనే, అర్ధరాత్రి వేళ విశాఖపట్నంలోని ఒక జంక్షన్ వద్ద తన గన్‌మెన్ ద్వారా లాప్‌టాప్‌ను పంపించి తన ఉదారతను చాటుకున్నారు.

శంకర్ రావు నివసిస్తున్న చిన్న రేకుల షెడ్డును చూసిన ఎమ్మెల్యే, త్వరలోనే ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన P4 ఆలోచన వల్లే మా లాంటి పేదలకు పెద్దల సహాయం అందుతోంది” అని శంకర్ రావు భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పలువురు మార్గదర్శకులు పి4 పై పలు అంశాలు వివరించారు. మార్గదర్శకులు ముఖ్య అతిధి దృశ్యాలువాలతో సన్మానించారు. పాఠశాల విద్యార్థులు నృత్యలు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి  జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి, వివిధ శాఖల అధికారులు బంగారు కుటుంబాల మార్గదర్శులు, బంగారు కుటుంబ సభ్యులు ఉన్నారు.

*మార్గదర్శుల వివరములు*

1.జిల్లా విశిష్ట మార్గదర్శిగా ఎంపిక కాబడిన జిల్లేళ్ల మూడి అమ్మ సేవా సమితి, పార్వతీపురం వారు గత కొన్ని సంవత్సరములుగ ఎన్నో సామాజిక కార్యక్రమములు చేపడుతూ ప్రస్తుతం P4 కార్యక్రమంలో భాగస్వామ్యం కాబడ్డారు. వీరు ప్రతిదినం జిల్లా ఆసుపత్రిలో రోగులకు మరియు వారి బంధువులకు ఆహారము మరుయు దుస్తులు అందిస్తున్నారు .వీరి వార్షిక వ్యయం సుమారు రూ. 15 లక్షలు.( జిల్లేళ్ల మూడి అమ్మ సేవా సమితి అధ్యక్షులు : శ్రీ G.సోమేశ్వర రావు గారు.)

2.జిల్లా స్థాయి ప్రధమ ప్రశంస పత్రానికి ఎంపిక కాబడిన మార్గదర్శి డా.B.అప్పలనాయుడు గారు సాలూరు మండలం, కొత్తవలస గ్రామంను దత్తత తీసుకొనడం ద్వారా 177 బంగారు కుటుంబాలకు తన వంతు వైద్య సహాయం మరియు సహకారములు అందిస్తున్నారు.

3.జిల్లా స్థాయి ద్వితీయ ప్రశంస పత్రానికి ఎంపిక కాబడిన మార్గదర్శి శ్రీ Ch. శ్రీనివాసరావు గారు, వీరఘట్టం మండలం, తలవరం గ్రామం Z.P High School నకు stage (Dias) నిర్మాణమును రూ.1.5 లక్షలతో నిర్మించారు.

4.జిల్లా స్థాయి తృతీయ ప్రశంస పత్రానికి ఎంపిక కాబడిన మార్గదర్శి శ్రీ V. వీరేష్ చంద్ర దేవ్ గారు కురుపాం గ్రామంలో సుమారు రూ.72,000 లతో విద్యార్థుల పరీక్షలకు అవసరంపైన Kit లను పంపిణీ చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి