రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాల లక్ష్యాల సాధనకు  జిల్లా కలక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలక్టర్లతో జరిగిన వీడియో కాన్పరెన్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం అమలు చెస్తున్న పధకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జిల్లా కలక్టర్లకు దిశా నిర్దేశం చేస్తు పధకాల లక్ష్యాల సాధనకు జిల్లా కలక్టర్లు కృషి చేయాలని తెలిపారు. రెవన్యూ, పి.జి.ఆర్.ఎస్. లో ప్రజల వినతులు,  పంచాయితీరాజ్, వ్యవసాయం,  విద్యుత్, పరిశ్రమలు, ఎన్.టి.ఆర్. భరోసా పెన్షన్లు, అన్నా కాంటీన్లు, పౌర సరఫరాలు, పరిశ్రమలు, పోలీస్ వ్యవస్థ (గంజాయి నిర్మూలన, మహిళలపై దాడులు),  సాంఘిక సంక్షేమం, బి.సి. సంక్షేమం, ఎస్.సి. కార్పోరేషను పధకాల అమలు, మున్సిపల్ సర్వీసెస్, మున్సిపాలిటి శానిటేషను, కుటుంబ సర్వే, జిరో ప్రోవర్టీ పి4, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.  ఈ వీడియో కాన్పెరెన్సులో జిల్లా జాయింటు కలక్టరు సేతు మాధవన్, విద్యుత్ శాఖ ఎస్.ఇ.లక్షణరావు,  ఎస్.సి. కార్పోరేషను ఇ.డి. వెంకటేశ్వరరావు, సోషల్ వెల్పేర్ డిడి అన్నపూర్ణమ్మ, బి.సి. వేల్పేర్ అధికారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి