పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం చీపురు వలస గ్రామం సమీపంలో మార్చి 28 వ తేదీన మామిడి తోటలో వతిక ఐశ్వర్య అనే బాలిక (20 years)ఉరివేసుకొని మృతి చెందిన కేస్ ను 48 గంటల్లో ఛేదించిన మన్యం జిల్లా పోలీస్ లు ముద్దాయి ని అరెస్ట్ చేశారు. దీని పై పార్వతీపురం మన్యం జిల్లా dsp అంకిత సురాన మీడియా సమావేశం నిర్వహించారు. సాలూరు మండలం మర్రి వాని వలస గ్రామానికి చెందిన వతిక ఐశ్వర్యకు దతి వలస గ్రామానికి చెందిన రాంబాబుతో గత 6 నెలలకు ముందు పరిచయం ఏర్పడగా అది కాస్తా ప్రేమగా మారి కొద్ది రోజులు క్రితం విశాఖపట్నం ఆరిలోవ లో ఒక రూమ్ తీసుకొని నివసిస్తుండ గా ఐశ్వర్య తనను పెళ్లిచేసుకోవలని రాంబాబుని ప్రోద్బలం చేయగా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో రాంబాబు ఐశ్వర్యాని గాయపరచి ఇంట్లో ఉన్న తాడును మెడకు బిగించి హత్య చేయబోయడని దీంతో అపస్మారక స్థితి లోకి వెళ్లిన ఆమెను దగ్గర లో ఉన్న ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్స్ చెప్పగా అక్కడినుండి ఇద్దరు స్నేహితులు సహాయంతో మృతదేహాన్ని విశాఖపట్నం నుండి బైక్ పై సాలూరు మండలం చీపురువలస దగ్గర తోటలో చెట్టుకు ఉరివేసుకొనెల ఆమె చున్నీ తో చెట్టుకు వేలాడదీసారని తెలిపారు. తన పై అనుమానం రాకుండా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అందరిని నమ్మించడానికి ఈ విధంగా చేసినట్లు విచారణలో తెలిందని పోలీస్ లు తెలిపారు. ఈ ఘటనలో A1 గా ఉన్న రాంబాబుని అరెస్ట్ చేయడం జరిగినదని మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరుస్తామని dsp తెలిపారు.


