పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఖండించారు.
సాలూరు నియోజకవర్గానికి సంబంధించి విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేద్దామని కొంతమంది నిర్ణయం తీసుకొని ఏకపక్ష ధోరణి తో సంఘాన్ని సంఘ సభ్యులను నిర్ణయించి కరపత్రాల ముద్రించి నియోజకవర్గ మొత్తం పంచడం సమంజసం కాదని, ఇలాంటి నియోజకవర్గానికి సంబంధించిన సంఘాలు ఏర్పాటు చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు ముందుగా నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులందరికీ సంప్రదించి సమావేశం ఏర్పాటు చేసి సభ్యులను ఎంచుకొని లేదా ఎన్నికలు చేసి సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఇలాంటివి జరగకుండా వాళ్లలో వాళ్లే నిర్ణయం తీసుకొని కరపత్రాలు ముద్రించి పంచడాన్నీ సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు సంగేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు.




