పాచిపెంట మండలంలోని *మంచాడవలస,సీతంపేట, పనుకు వలస,చీపురువలస గిరిజన గ్రామాల ప్రజలు* సాంప్రదాయబద్ధంగా *ఇటుక పండుగ* ను ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా రోడ్లపై వాహనాలను ఆపుతూ ఆనందోత్సాహాల మధ్య చందాలు సేకరిస్తున్నారు.

ఈ గ్రామాల గుండా బడ్నాయక వలసలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్తున్న *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారిని గిరిజనులు ఆపారు.ఆయన వెంటనే కారు దిగి గిరిజనులకు ఇటుక పండుగ శుభాకాంక్షలు తెలియజేసి,వారికి పళ్లెంలో దక్షిణ అందించారు.

*మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారి రాకతో ఆయన సరళ స్వభావానికి ఆకర్షితులైన యువత,మహిళలు,ప్రజలు ఆయనతో కలిసి ఉత్సాహంగా ఫోటోలు,సెల్ఫీలు తీసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సంఘటన అక్కడ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది. గ్రామీణ సాంప్రదాయ పండుగలో తమ నాయకుడు పాల్గొనడం పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనతో దింశా నాట్యం చేశారు..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి