రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాల నిరసన

రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజన సంఘాల నిరసన

మెలియాకంచూరు పంచాయతీ. కొండలుద్దండి గిరిజన గ్రామము నుండి. అల్లం పాడు ములగపాడు కొండ మోసూరు మీదగా. కే రంగ సెంటర్ కు. రహదారి నిర్మాణం చేపట్టాలని. ఆదివాసి గిరిజన సంఘం. నాయకులు.  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.  కార్యక్రమాలు లో గిరిజన సంఘ నాయకులు  మాట్లాడుతూ రహదారులు లేకపోవడం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నామని ఆటోలు కూడా తిరగడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి ఏర్పడిందని ఆరోగ్యం సమస్యలు వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలను తీసుకువెళ్లాలంటే రాత్రి వేళలో మోసుకొని వెళ్లడమే తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఇదిగో ప్రారంభిస్తాం అదిగో  ప్రారంభిస్తాం అని చెప్తున్నారు కానీ ప్రారంభించకపోవడం రహదారి లేకపోవడం ఎన్నో ఆటంకాలు గురవుతున్నామని మా పరిస్థితుల్ని అర్థం తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజనులకు అండగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. గిరిజనుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వలన గిరిజన బతుకులు మారలేదని అన్ని విధాల వెనకబడిపోతున్నారని నిత్యావసర సరుకులు సకాలంలో తెచ్చుకోవాలని వీలుగాని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయిన నేటి వరకు రహదారులు త్రాగునీరు సమస్య పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నారంటే అనారోగ్యంగా ఉన్న వారిని డోలీమోతులు గురవుతున్నారు. అంటే ఎంతో సిగ్గుచేటని అన్నారు. ఐటీడీఏ పీవో మరియు జిల్లా కలెక్టర్  స్పందించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రహదారుల కొరకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని ఇప్పుడు కొండలుద్దండి నుండి కే రంగదారి సెంటర్ వరకు. రహదారి నిర్మాణం పై శ్రద్ధ పెట్టాలని. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం మానుకొని గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు గిరిజన ప్రాంత అభివృద్ధి కావాలంటే రహదారుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని ఇచ్చినటువంటి హామీలు మేరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి పాట అనే పేరుతో గిరిజన ప్రాంతం అభివృద్ధి చేయాలని చెప్పడం మంచి పరిణామమైన అడవి తల్లి బాట అభివృద్ధి కావాలంటే. గిరిజనకు ప్రాంతాల అభివృద్ధికి రహదారుల కీలకమని ఈఎస్ఎం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా స్పందించాలని గిరిజన యువత డప్పు శ్రీరాములు కొర్ర జన్ని శంకర్ కోటపర్తి లచ్చయ్య జర్నీ శంకర్రావు పండయ్య కోటపర్తి గంగమ్మ డప్పు అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి