స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి పాలక వ్యతిరేక తిరుగుబాటుదారుడిగా చరిత్రలో నిలిచిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిబ్రవరి 22న ఘనంగా నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1846లోనే ప్రజలను సంఘటితం చేసి పోరాటం ప్రారంభించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతంలో రైతులు, సాధారణ ప్రజలపై బ్రిటిష్ అధికారుల అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తి తిరుగుబాటు చేసిన ఆయన ధైర్యసాహసాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. పోలీస్ శాఖ విధుల్లో నిబద్ధత, ధైర్యం, త్యాగం అత్యంత ముఖ్యమని, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారి జీవితం పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రజల రక్షణ, చట్ట పరిరక్షణ కోసం పనిచేసే పోలీస్ సిబ్బంది ఆయన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు ఆయన జీవిత విశేషాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన సేవలను స్మరించుకున్నారు.

అనంతరం పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి