– విజయనగరం జిల్లా మీడియా విభాగం అధ్యక్షురాలుగా సునీత రెడ్డి – విజయనగరం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విజయలక్ష్మిరెడ్డి – ఏబిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి అఖిల భారత రెడ్డి సంఘం లో ఇరువురుని నియమించినట్లు అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులునారుపల్లె జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోన్నపురెడ్డి శకుంతల రెడ్డి లు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ అఖిల భారత రెడ్డి సంఘంలో పలువురుని నియమించి వారికి నియామక పత్రాలు అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా మీడియా విభాగం అధ్యక్షురాలుగా పోలూరు సునీత రెడ్డిని, విజయనగరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా బోడే విజయలక్ష్మిరెడ్డి లను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శకుంతల రెడ్డి , రాస్తా మీడియా విభాగం అధ్యక్షులు కుర్రే రాజేంద్ర రెడ్డి లు తెలిపారు .ఈ సందర్భంగా రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వివిధ పదవులు పొందిన వారికి అఖిల భారత రెడ్డి సంఘము తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.మీ నాయకత్వంలో రెడ్డి యువత, మహిళాలు ఐక్యంగా ముందుకు సాగి, సమాజాభివృద్ధి దిశగా మరింత కృషి చేస్తారని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము.రెడ్డి సమాజం ఐక్యమే మన బలం మీ సేవా ప్రయాణం విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము అని తెలిపారు. సునీత రెడ్డి , విజయలక్ష్మి రెడ్డిలు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో పదవులు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురుకూటి రామభూపాల్ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొన్నపురెడ్డి శకుంతల రెడ్డి, రాష్ట్ర మీడియా విభాగం అధ్యక్షులు రాజేంద్రరెడ్డి ఇతర రాష్ట్ర, జిల్లాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనివారు అన్నారు. విజయనగరం జిల్లాలో అఖిలభారత రెడ్డి సంఘమును బలోపేతం చేసినందుకు తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు Spread the love టపా నావిగేషన్ ఆకులు ఒల్లంత కట్టుకొని అడవి శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా రహదారి కోసం నిరసన