సాలూరు రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ గారు మాట్లాడుతూ ఉగాది గొప్పతనాన్ని విద్యకు ఉగాదికి మధ్య ఉండే అవినవ భావ సంబంధాన్ని వివరించారు. ఈ సందర్భంగా కొందరు నూతన విద్యార్థులు రవీంద్రభారతిలో తమ కొత్త విద్యా శకాన్ని ఆరంభించారు. తెలుగు ఉగాది లాగే విద్యార్థుల జీవితాలు కళకళలాడేలా రవీంద్ర భారతి ఎప్పుడు కృషి చేస్తుందని వక్కానించారు.
