రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించారు.నాణ్యత తో కూడుకున్న వైద్యం అందించాలి. హిల్ టాప్ ఏరియా అయినా ప్లేన్ ఏరియా నుండి వచ్చిన రోగులు ఎవరైనా సరే ఎమర్జెన్సీ కేసులను పూర్తిగా వైద్యాన్ని అందించాక తప్పదని పరిస్థితుల్లోనే రిఫ్రి చేయాలి మన హాస్పిటల్ లో అన్ని వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉంచాలి పేషంటు ప్రైవేట్ మెడికల్ షాప్ కొనుక్కునే పరిస్థితి తీసుకురాకూడదు అని పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని వచ్చినప్పుడు వారిని ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ రాయడం చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాలు గాని సదుపాయాలు గాని కొదవ ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.