అప్రకటిత విద్యుత్ కోతలతో పురవాసులు ఇక్కట్లు సాలూరు ఫిబ్రవరి 21వేసవి రాకముందే విద్యుత్ కోతలు విధుస్తుంటే మే, జూన్ నెలల్లో మండు వేసవిలో రోజులో ఇంకెన్ని సార్లు విద్యుత్ కోతలు విధిస్తుంటారని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు పట్టణంలో ఎటువంటి ముందస్తు ప్రకటనలు చెయ్యకుండా రోజుకు పది పదిహేను సార్లు విద్యుత్ కోతలు విధించడంతో పురవాసులు ఎన్నిసార్లు అధికారులకు ఫోన్లు చేసినా ఏ ఒక్కరు ఫోన్లు ఎత్తి సమాధానం చెప్పక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం స్థానిక విలేకరులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసినా సమాధానం చెప్పకపోవడం విడ్డూరంగా ఉంది. Spread the love టపా నావిగేషన్ సాలూరు లో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర