మహాశివరాత్రి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ పరమ శివుని దర్శనం కోసం తెల్లవారు జాము నుండే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గల పారమ్మ కొండపై వెలసి ఉన్న పారమ్మతల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున
నిర్వహిస్తారు. సుమారు 2 కిలోమీటర్లు 3000 మెట్లు కాలినడకన వెల్లి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది
ఆరోజు అమ్మవారి దర్శనానికి ఉత్తరాంధ్రజిల్లాలతోపాటు ఒడిషా, చత్తీష్ ఘడ్ రాష్ట్రాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి
అమ్మవారి దర్శనం చేసుకుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ,అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు
ఏజెన్సీ ప్రాంతం కావడంతో సుమారు 150 మంది పోలీసులతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసారు. సాలూరు,పాచిపెంట మండలాల నుంచి
అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆశిస్తూ ఆర్టీసీ 25 బస్సులను కొండ దిగువ వరకు నడపనుంది. భక్తుల సౌకర్యార్థం స్వఛ్చంద సంస్థల ఆధ్వర్యంలో
కొండపై మంచినీటి సదుపాయం, ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేసారు.













