ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఈరోజు సాలూరు నియోజకవర్గం అంతటా జరిగాయి.ఈ నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు వివాదాస్పద గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 68% అక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ వివాదాస్పద గ్రామాల్లో ఎటువంటి ఎన్నికలు జరిగినా ఇక్కడ ఓటర్లు ఇటు ఆంధ్రప్రదేశ్ కు అటు ఒరిస్సాకు ఎటువైపు ఓటు వేయాలో అన్న సందిగ్ధంలో తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించలేకపోయేవారు. అలాంటిది ఈరోజు ఉదయం గిరి శిఖర ప్రాంతాల నుంచి నేలవలస తదితర పోలింగ్ బూతులకు నడుచుకుంటూ మరియు ప్రైవేటు వాహనాల్లో వచ్చి మరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు