పదిలో శతశాతం ఫలితాలను సాధించాలిజిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డివిటి అగ్రహారం జెడ్‌పిహెచ్ స్కూల్ ఆకస్మిక తనిఖీ పదోతరగతిలో శతశాతం ఫలితాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. స్థానిక విటి అగ్రహారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులతో మాట్లాడి బోధన గురించి తెలుసుకున్నారు. విద్యార్ధుల హాజరు, పదోతరగతి విద్యార్దులకు నిర్వహిస్తున్న ప్రత్యేక వంద రోజుల శిక్షణా కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథక నిర్వహణ, పాఠశాలలోని ఇతర సమస్యలను తెలుసుకున్నారు. సుమారు 106 మంది పదోతరగతి విద్యార్ధులకు వంద రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కిచెన్ షెడ్ శిధిలావస్థకు చేరుకుందని, మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయాల్సి ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.మార్టిన్ లూథర్ కలెక్టర్‌కు వివరించారు. పదోతరగతిలో అందరూ ఉత్తీర్ణత సాధించేవిధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఇతర సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. Spread the love టపా నావిగేషన్ పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందివిజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు