జనసేనలో 10 ఏళ్ల పాటు కష్టపడ్డ నాయకులకే మొదటి ప్రాధన్యత ఇస్తాం వారికే కూటమి తరపున సీట్లు కేటాయించేలా చేసి వారినే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం….
పార్టీ సూచనల మేరకు ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి చాలా పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది అందులో కొందరు మృదువుగా తిరస్కరిస్తే మరికొందరు మా పార్టీని మా అధినేతను చిన్న చూపు చూసి అవహేళన చేసిన వారు ఉన్నారు ….
అలాంటి వారిలో చాలామంది నేడు మరో ఆప్షన్ లేక జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలని చూస్తున్నారు …
అలా వచ్చేవారిని తీసుకునే విషయంపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాము ప్రస్తుతానికి అలాంటి వారిని తీసుకునే అవసరం లేదు అని పార్టీ పెద్దలు తెలిపారు …
భవిష్యత్ లో మరికొంత కాలం తరువాత పార్టీ స్థానిక నాయకులకు ఇబ్బంది లేదు వారితో కలిపి పనిచేసుకుంటాం అని తెలిపితే ఆ మండలం లేదా ఆ పట్టణం నుండి నాయకులను జాయిన్ చేసుకుంటాం అని పార్టీ పెద్దలు తెలియచేశారు ….
ప్రస్తుతం కూటమితో పొత్తుల్లో కొనసాగుతున్నాం …
ఇలాగే కూటమితో కొనసాగితే రానున్న ఎన్నికల్లో వేరే పార్టీల అవసరం లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా భారీ స్థాయిలో కూటమి గెలుపొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి దానికి కావాల్సిన అభ్యర్థులు కూటమి పార్టీలలో సిద్ధంగానే వున్నారు …
ఈ సమయంలో ఇలాంటి జాయినింగ్స్ విషయంపై లోతుగా విశ్లేషించి ప్రతి గ్రామ మండల నియోజకవర్గ నాయకులతో చర్చించి సీట్ల సర్దుబాటులో ఏ స్థానంలో ఇబ్బంది ఉండదు ఏ స్థానంలో నాయకులు కావాలి అని కోరుకొని ఆహ్వానిస్తే అటువంటి స్థానాల నుంచి వచ్చేవారిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఇప్పుడు కాదు భవిష్యత్ లో మాత్రమే …