మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటాం

మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులను అన్ని విధాల ఆదుకుంటాం



వచ్చే దీపావళి నాటికి శాశ్వత భవనాన్ని మీకు అందుబాటులోకి తీసుకువస్తా

జ్యోతిరావు పూలే పాఠశాలలో దీపావళి వేడుకలు జరుపుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని, ఈ పాఠశాల శాశ్వత భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం స్థానిక జ్యోతిరావు పూలే వసతి గృహంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దీపావళి వేడుకలను మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే పాఠశాలలో వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థుల మధ్య ఇటువంటి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. జ్యోతిరావు పూలే శాశ్వత భవన నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, స్థల సేకరణ చేసి, త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. వచ్చే దీపావళి నాటికి ఈ భవన నిర్మాణం పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి