తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా రహదారులు ఉన్నటువంటి ప్రాంతాలకు వాహనాలు తల్లి బిడ్డను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ ఏరియా సాలూరు ప్రభుత్వహాస్పిటల్ లో ఆడపిల్ల పుట్టి న తర్వాత ఈరోజు డిశ్చార్జ్ ఇవ్వడం జరిగిందని పాప ఆరోగ్యం బాగానే ఉందని అయితే పాచిపెంట మండలం సతాబి. గిరిజన గ్రామం. వెళ్లేందుకు వెళ్లడానికి తల్లీ బిడ్డను తీసుకువెళ్లడానికి వాహనం పెట్టలేదని ఆటో ద్వారా వెళ్ళవలసి వచ్చిందని బాలింత అయిన అల్పజన్ని కుమారి పత్రికా విలేకరులకు తెలిపారు. శతాభి వెళ్లడానికి రహదారి బాగానే ఉన్నా వాహనాన్ని పంపించలేదని తెలిపారు .దీనివలన సొంతంగా ఆటో పెట్టుకుని వెళ్ళవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పేదవాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాలు వాహనాలు ద్వారా బాలింతలు పంపించే విధంగా సీరియస్ గా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలకు తల్లి బిడ్డల ను క్షేమంగా తీసుకెళ్లేందుకు వాహనాలను ఉపయోగించాలని కొన్ని గ్రామాలు రహదారులు బాగానే ఉన్నాయని అటువంటిది సతాబి అనే గిరిజన గ్రామం వెళ్లే వరకు రోడ్డు ఉందని మరి బాలింత అయిన అల్పజన్ని కుమారి పాప పుట్టిన తర్వాత సాలూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్సు మరియు సిబ్బంది మీ సొంతంగా వెళ్లండి అని చెప్పడం సరికాదని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి సమస్యలు రాకుండా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ నుంచి క్షేమంగా చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

